Cultural
11 April 2026
Government College for Men(A), Kadapa
Telugu
COLLEGE DAY 2026
Audience
ALL UG Students, Staff
Organizers
All Staff members including Teaching an…
Outcome / Summary
కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి)(ఆర్ట్స్ కళాశాల)లో కళాశాల 78 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డా.ఎం.రవికుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన కళాశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు డా.జ్ఞానేశ్వర్ గారు మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులు కళాశాలలో బాగా చదివి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. అందుకు తగినట్లుగా అధ్యాపకులు వివిధ రకాల నైపుణ్యాలను అంశాలను బోధిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మొదటగా ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఎం రవి కుమార్ గారు కళాశాల నివేదికను సమర్పించారు. గౌరవఅతిథిగా విచ్చేసిన కళాశాల ప్రణాళికా సంఘం సభ్యులు శ్రీ మానస చిన్నపరెడ్డి గారు, శ్రీ పోతుల వెంకట్రామిరెడ్డి గారు, సర్వశిక్షా అభియాన్ శాఖ లోని ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురివిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ కళాశాల గతంలో ఎంతోమంది ఉన్నతాధికారులను, కలెక్టర్లను, అధ్యాపకులను, కళాకారులను తయారు చేసిన ఘనత పొందిందని అన్నారు. ఈ కళాశాలలో చదువుకోవడం తమ అదృష్టమని పూర్వ విద్యార్థులైన అతిధులు కళాశాల పూర్వ విద్యార్థులు కొనియాడారు. తాను కళాశాల అభివృద్ధికి అన్నివేళలా కృషి చేస్తానని ప్రిన్సిపాల్ గారు, అతిథులు ప్రకటించారు. కళాశాల ఉప ప్రధానాచార్యులు డాక్టర్ ఎం రమేష్ మాట్లాడుతూ ప్రిన్సిపాల్ గారి నాయకత్వంలో అధ్యాపకుల సహకారంతో విద్యార్థినీ,విద్యార్థులకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు. కళాశాల పరిపాలనాధికారి డాక్టర్ రమణ రావు గారు ప్రసంగిస్తూ కళాశాల ఎంతో ప్రఖ్యాతి,ఘనతలు కలిగినదని, ఈ కళాశాలలో పనిచేయడం తమ అదృష్టమని అన్నారు. ప్రధానవక్తల ప్రసంగం ముగిసిన తర్వాత విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో సాంస్కృతిక కార్యక్రమాలలో తమ ప్రతిభ పాటవాలను చూపారు. కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు అధ్యాపకులు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు